: అందరం గొప్పవాళ్లమే... అదృష్టవంతులు పదవుల్లో ఉన్నారు: జ్యోతులు


శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా చంద్రబాబు దగ్గరే పాఠాలు నేర్చుకున్నారని అన్నారు. దీనిపై నెహ్రూ మాట్లాడుతూ, ఇక్కడ ఎవరూ ఎవరి దగ్గరా పాఠాలు నేర్చుకోలేదని అన్నారు. మనమంతా ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చిన వారమని ఆయన గుర్తు చేశారు. అదృష్టం ఉన్నవాళ్లంతా పదవుల్లో కొనసాగుతూ ఉన్నతస్థాయిలో ఉన్నారని, దురదృష్టవంతులంతా ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారని ఆయన పేర్కొన్నారు. అంతా గొప్పవాళ్లమన్న విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News