: ముందు రూల్స్ తెలుసుకోండి: బాబు
వైఎస్సార్సీపీ నేతలు ముందు సభామర్యాదలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హితవు పలికారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ఏర్పాటుకు నిర్దేశించిన సీఆర్డీఏ బిల్లులోని అంశాలను మంత్రి చెబుతున్న విషయాన్ని ప్రతిపక్షం గుర్తించాలని అన్నారు. శాసనసభలో సభామర్యాదలు పాటించాలని ఆయన సూచించారు. సభామర్యాదలను, సభలో పాటించాల్సిన విధివిధానాలను తెలుసుకోవాలని ఆయన చెప్పారు. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత విధివిధానాలు ఖరారు చేస్తారన్న విషయం ప్రతిపక్షాలు తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.