: ఈ అసెంబ్లీ కౌరవ సభ: జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌరవ సభలా తయారయిందని విపక్ష నేత వై.ఎస్.జగన్ విమర్శించారు. ద్రౌపదికి అన్యాయం చేసిన కౌరవులు నాశనం అయిపోయారని, వీరికి కూడా అదే గతి పడుతుందని శాపనార్థాలు పెట్టారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోరంట్లతో క్షమాపణ చెప్పించలేకపోయారని మండిపడ్డారు. టీడీపీ నేతల బుర్రలు చెడిపోయాయని, వారు తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు చేష్టలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేవుడు ఏదో ఒక రోజు వారికి మొట్టికాయలు వేయడం ఖాయమని అన్నారు.