: ఆఫ్ఘనిస్తాన్ లో 28 మంది మిలిటెంట్లు హతం
ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లపై ఆర్మీ జరిపిన దాడుల్లో 28 మంది మిలిటెంట్లు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. హెల్మంద్, పక్తికా, కునార్ ప్రావిన్స్ లలో నిన్నటి నుంచి సైనికులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో 28 మంది మిలిటెంట్లను మట్టుబెట్టారు. ఎదురు దాడికి దిగిన మిలిటెంట్లు ఐదుగురు సైనికులను హతమార్చారు. పాకిస్థాన్ లోని పెషావర్ సైనిక పాఠశాలపై దాడి జరిగిన అనంతరం పాక్ సరిహద్దు దేశాలు కూడా తీవ్రవాదులపై దాడుల తీవ్రతను పెంచాయి.