: అనుష్క హాట్ ఫోటో షూట్ పై విరాట్ విసుగు!


సినీ హీరోయిన్లకు ఫోటోషూట్ లు సర్వసాధారణం. చిట్టిపొట్టి దుస్తుల్లో, కైపెక్కించే హొయలతో హాట్ ఫోటో షూట్ చేస్తే బాగానే గిట్టుబాటవుతుంది. అభిమానుల్లో ఫుల్ క్రేజ్ కూడాను. దీంతో, డిమాండు తగ్గిన హీరోయిన్లు హాట్ ఫోటో షూట్ ల వైపు మొగ్గు చూపుతుంటారు. ఫుల్ స్వింగ్ లో ఉంటే ఫోటో షూట్ ల వైపు చూడమన్నా చూడరు. ఒకవేళ టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లాడితే సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో కానీ, ఇప్పుడు మాత్రం బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఫోటోలకు హాట్ పోజులిచ్చింది. వీటిని చూసి కోహ్లీ కాస్తంత చిరాకుపడ్డాడట. పెళ్లి ఘడియలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఫోటో షూట్ అవసరమా? అని కూడా అన్నట్టు తెలుస్తోంది. మరి అనుష్క ఎలా తన హీరోని కూల్ చేసి ఉంటుందో!

  • Loading...

More Telugu News