: యాదగిరిగుట్ట లాడ్జీల్లో మరోసారి పోలీసుల తనిఖీలు... అదుపులో ప్రేమపక్షులు!
పవిత్ర పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ప్రేమికులకు అడ్డాగా మారుతోంది! సమయం దొరికితే జంటలుగా వాలిపోయి గుట్ట పరిధిలోని లాడ్జీల్లో కాలం గడుపుతూ నిజమైన భక్తులకు ఇబ్బందిగా మారారు. గుట్టలో అశ్లీలానికి తావు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డీఎస్పీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు లాడ్జీల్లో సోదాలు నిర్వహించిన పోలీసులు ఆరు ప్రేమ జంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ యాదగిరిగుట్ట వద్ద ఇటువంటి కార్యకలాపాలను అనుమతించబోమని ఈ సందర్భంగా మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.