: పాత నోట్ల మార్పిడికి ముగుస్తున్న గడువు


కరెన్సీ నోట్ల మార్పిడికి సమయం ముగుస్తోంది. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు కేవలం పది రోజుల గడువు మాత్రమే ఉంది. 2005 కంటే ముందు ముద్రించిన 100, 500, 1,000 రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ జనవరి 1వ 2015 వరకు గడువు ఇచ్చింది. 2005 కంటే ముందు ముద్రించిన కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ 2014 జనవరి 22న ప్రజలకు తెలిపింది. ఆర్బీఐ ప్రకటించిన అనంతరం సుమారు 144.66 కోట్ల రూపాయలను బ్యాంకుల్లో మార్చుకున్నారని సమాచారం. 2005 తరువాత తాము ముద్రించిన కరెన్సీ నోట్లపై నోటు తయారు చేసిన ఏడాదిని పేర్కొన్నామని, అంతకుముందు ముద్రించిన కరెన్సీపై సంవత్సరం ఉండదని ఆర్బీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News