: విదేశాల్లో టీమిండియా బ్యాటింగ్ దృక్పథం మెరుగైంది: ధోనీ


టీమిండియా విదేశాల్లో టెస్టు మ్యాచ్ లు గెలవడానికి ఇంకా విఫలయత్నాలు చేస్తున్నా, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం బ్యాటింగ్ పరంగా బాగా మెరుగయ్యామని చెబుతున్నాడు. గత ఏడాదిగా టెస్టుల్లో విదేశీ గడ్డపై మన బ్యాటింగ్ దృక్పథంలో మార్పు వచ్చిందని తెలిపాడు. మునుపటి మ్యాచ్ లతో పోల్చితే, ఆసీస్ తో తొలి రెండు టెస్టుల్లో బాగానే బ్యాటింగ్ చేశామని, ఆ ఒరవడి కొనసాగిస్తామని చెప్పాడు. ఇక, అనుభవానికి ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడ్డాడు. అనుభవజ్ఞులను ఎక్కడి నుంచో తీసుకురాలేమని, మ్యాచ్ లు ఆడే కొద్దీ ఆటగాళ్లే అనుభవజ్ఞులవుతారని పేర్కొన్నాడు. ఎంత ఎక్కువ ఆడితే అంత అనుభవం వారి సొంతమవుతుందన్నాడు.

  • Loading...

More Telugu News