: కళ్లార్పకుండా అబద్ధాలు చెబుతున్నారు: చంద్రబాబుపై జగన్ విమర్శ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శల జడివాన కురిపించారు. రుణమాఫీపై చర్చ సందర్భంగా తనపై మాటల దాడికి దిగిన చంద్రబాబుపై ఆయన ప్రతిదాడి చేశారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్ధాలాడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబులాగా అబద్ధాలాడే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని జగన్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన సంజ్ఞలు టీడీపీ సభ్యులను ఉడికించగా, వైెఎస్సార్సీపీ సభ్యుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అసలు, రుణమాఫీలో రైతులకిస్తున్నదెంత? తదితర విషయాలు చెప్పాలని అడిగితే సమాధానం లేకపోతే ఎలాగంటూ ఆయన ఆసహనం వ్యక్తం చేశారు. కేస్ స్టడీలంటే అర్థం తెలియవారికి ఏం చెప్పేదంటూ జగన్ విస్మయం వ్యక్తం చేశారు.