: బాగా పాడలేనప్పుడు పాడటం ఆపేస్తా: బాలు
తాను బాగా పాడలేనప్పుడు ఇక పాడటం ఆపేస్తానని సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. తాను సంగీత సేవకుడినని పేర్కొన్నారు. ఆయన ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి విచ్చేశారు. నటుడు, సంగీత కళాకారుడు శ్రీపాద జిత్ మోహన్ మిత్రా పౌర సన్మాన కార్యక్రమంలో బాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగీతాన్ని దేవుడిగా భావిస్తానని, దానిపై శ్రద్ధ చూపడం ద్వారా అందరి మన్ననలు అందుకోవడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. కాగా, జిత్ మోహన్ మిత్రా పలు తెలుగు చిత్రాల్లో నటించారు. క్లాసిక్ చిత్రాల దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన శంకరాభరణం, సప్తపది చిత్రాల్లో ఆయన చిన్న పాత్రలు పోషించారు.