: ఉరిశిక్షల అమలులో పాకిస్తాన్ జోరు


పెషావర్ లో సైనిక స్కూల్ పై తాలిబాన్ల దాడి తరువాత ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా పాకిస్తాన్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, ఉరిశిక్షలను అమలు చేయడంలో పాకిస్తాన్ జోరు పెంచింది. ముఖ్యంగా, ఉగ్రవాద చర్యలకు పాల్పడి మరణదండన శిక్షతో జైళ్లలో ఉన్న వారికి శిక్షలను అమలు చేస్తోంది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై హత్యాయత్నం చేసిన గులాం సర్వార్, రషీద్ తిపు, జుబైర్ అహ్మద్, అఖ్లాక్ అహ్మద్ లను ఉరితీసినట్టు ఫైసలాబాద్ జైలు అధికారులు తెలిపారు. ఇదే జైలులో శుక్ర, శనివారాల్లో నలుగురిని ఉరితీసిన సంగతి తెలిసిందే. మరణశిక్షను ఎదుర్కొంటున్న ఉగ్రవాదులకు సాధ్యమైనంత త్వరలో శిక్షను అమలు చేయాలని భావిస్తున్నట్టు పాక్ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News