: మత మార్పిళ్లలో ఎలాంటి తప్పులేదు: శివసేన
దేశ వ్యాప్తంగా కలకలం రేపుతున్న మత మార్పిళ్లపై శివసేన పార్టీ తన 'సామ్నా' పత్రిక సంపాదకీయంలో స్పందించింది. ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా, గతంలో చాలామంది హిందువులను ముస్లింలుగా మార్చినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని వ్యాఖ్యానించింది. "నిన్నటివరకు, హిందువులను ముస్లింలుగా మార్చారు. అవి ఒత్తిడి ద్వారా లేదా ప్రలోభ పెట్టడం ద్వారా జరిగాయని ఎవరూ అనలేదు. కానీ ఇప్పుడు గంగా నది వ్యతిరేక దిశలో ప్రవహించడం ప్రారంభించగానే ఆ మత మార్పిళ్లు సరికాదని నకిలీ లౌకికవాదులు అంటున్నారు" అని సేన పేర్కొంది. మొఘల్ కాలంలో హిందువులను ముస్లింలుగా... పోర్చుగీసు, బ్రిటీష్ పరిపాలనలో క్రిస్టియన్లుగా బలవంతపు మార్పిళ్లు చేసిన దానిపై ఈ లౌకికవాదులు ఏం చెబుతారని అడిగింది. ఇది కేవలం బీజేపీ మద్దతుదారులు చేయిస్తున్న మార్పిళ్లుగా కనిపిస్తోందని, దాంతో కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్న ఆ పార్టీ ప్రభుత్వం ఇరకాటంలో పడిందని పేర్కొంది.