: ఈ క్రికెటర్ ఆసీస్ జట్టుకు ఎంపికైనా, తండ్రికి మాత్రం నమ్మకం కలగలేదట!


టీమిండియాతో మూడో టెస్టుకు ఆసీస్ జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో యువ బ్యాట్స్ మన్ జో బర్న్స్ (25) కు స్థానం కల్పించారు ఆసీస్ సెలక్టర్లు. జాతీయ జట్టుకు ఎంపికవడం అంటే ఏ క్రికెటర్ కైనా సంతోషదాయకమే కదా! బర్న్స్ కూడా అలాగే ఎగిరి గంతేశాడు! వెంటనే తండ్రికి విషయం చెప్పాడు. అయితే, ఆయన తన కుమారుడి ఎంపిక విషయం నమ్మలేదట. ఏదో జోక్ చేస్తున్నాడన్న రీతిలో కొట్టిపారేశాడట. దీనిపై బర్న్స్ మాట్లాడుతూ, "మా నాన్న నా మాట నమ్మలేదు. దీంతో, కాస్త నిరాశకు గురయ్యాను" అని తెలిపాడు. 'బాక్సింగ్ డే' టెస్టుకు ఎంపిక కావడం ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. ఆసీస్ క్రికెట్ లో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న బర్న్స్ ఈ ఏడాది దేశవాళీ షెఫీల్డ్ షీల్డ్ పోటీల్లో 55 సగటుతో 439 పరుగులు చేశాడు. ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 42.54 సగటుతో 2978 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.

  • Loading...

More Telugu News