: ఇండియాలో హిందువుల సంఖ్యను 100 శాతం చేయడమే మా లక్ష్యం!: ప్రవీణ్ తొగాడియా
ఈ ప్రపంచంలో ఒకప్పుడు హిందువులు మాత్రమే ఉండేవారని, ఇండియాలో ప్రస్తుతమున్న 82 శాతం మంది హిందువులను 100 శాతానికి చేరుస్తామని విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా వ్యాఖ్యానించారు. భారత్ లో మరో మతం వారిని ఉండనీయబోమని ఆయన చెప్పకనే చెప్పారు. తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఇండియాలో హిందువుల జనాభాను తగ్గించి మైనారిటీలుగా చేయాలన్న కుట్రలను అడ్డుకుంటామని ప్రవీణ్ తెలిపారు. గతంలో కొందరి బలవంతంమీద మతాలను మార్చుకున్న వారు తిరిగి హిందూ మతంలోకి రావచ్చని, ఇందుకోసం 'ఘర్ వాపసి' పేరిట ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.