: మండలిలోనూ ఐకేపీ యానిమేటర్ల అరెస్టులపై గందరగోళం


శాసనసభలో విపక్షాల వాకౌట్, సభ వాయిదాకు కారణమైన ఐకేపీ యానిమేటర్ల అరెస్టుల పర్వం శాసనమండలిలోనూ గందరగోళానికి కారణమైంది. మండలి సమావేశాలు ప్రారంభం కాగానే ఐకేపీ యానిమేటర్ల అరెస్టులపై విపక్ష సభ్యులు వాయిదా తీర్మానమిచ్చారు. విపక్షాల వాయిదా తీర్మానాన్ని మండలి ఛైర్మన్ చక్రపాణి తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతివ్వాల్సిందేనని విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం ముందు బైఠాయించారు. విపక్ష సభ్యుల ఆందోళనలపై స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, సమస్య తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని, దీనిపై సమగ్ర వివరాలు తెలుసుకుని స్పందిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News