: భద్రాచలంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు


భద్రాచలంలోని రామాలయంలో నేటి నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ నెల 30 వరకు ఈ ఉత్సవాల్లో రాముడు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి నిత్య కల్యాణాలను రద్దు చేసినట్టు దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. ఈ నెల 31న పవిత్ర గోదావరి నదిలో తెప్పోత్సవం, జనవరి 1న ఉత్తర దర్శనం జరగనుంది. దాన్ని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉత్సవాల కోసం భద్రాద్రి ఆలయంలో, పట్టణంలో భారీ ఏర్పాట్లు చేశారు. కాగా, అధ్యయనోత్సవాలు ఇవాళ నుంచి జనవరి 11 వరకు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News