: 'బిగ్ బి' కూడా టీబీ బాధితుడేనట!


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తాను కూడా టీబీ (క్షయ వ్యాధి) బాధితుడినే అని వెల్లడించారు. 2000 సంవత్సరంలో తాను 'కౌన్ బనేగా కరోడ్ పతి' టీవీ గేమ్ షో చేయడానికి ముందు తనకు టీబీ సోకిందని తెలిపారు. బలహీనంగా ఉన్నట్టు అనిపించడంతో పరీక్షలు చేయించుకుంటే, టీబీ ఉన్నట్టు తెలిసిందని చెప్పారు. ఏడాదిపాటు చికిత్స తీసుకున్న తర్వాత వ్యాధి నయమైందన్నారు. బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) టీబీ వ్యతిరేక ప్రచార కార్యక్రమం 'టీబీ హరేగా దేశ్ జీతేగా' ఆవిష్కరణ సందర్భంగా అమితాబ్ ఈ విషయాలు పంచుకున్నారు. "టీబీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని ఈ రోజు మీ ముందు నిలుచున్నాను. ప్రస్తుతం సమర్థవంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. సకాలంలో మందులు వాడితే చాలు" అని పేర్కొన్నారు. కాగా, ఇంతకుముందు ఈ వ్యాధి నిరుపేదల్లో మాత్రమే కనిపిస్తుందని భావించేవారు. దీనిపై 'బిగ్ బి' మాట్లాడుతూ, వ్యక్తుల సామాజిక, ఆర్థిక స్థితికి టీబీకి సంబంధం లేదన్నారు. ఎవరికైనా సోకుతుందన్నారు.

  • Loading...

More Telugu News