: కేరళను తాకిన మత మార్పిడులు... హిందూ మతంలోకి 30 మంది క్రైస్తవులు


విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేరళలోని అలప్పుజకు చెందిన 8 క్రైస్తవ కుటుంబాల్లోని 30 మంది హిందూ మతం స్వీకరించారు. కనిచానలూరులోని ఓ దేవాలయంలో నిన్న ఈ మత మార్పిడులు జరిగాయి. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చట్టాలకు వ్యతిరేకంగా మత మార్పిడులు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు హోం మంత్రి సి.రమేష్ తెలిపారు. కాగా, మరో 150 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరుకుంటున్నాయని స్థానిక వీహెచ్ పీ నేత ప్రతాప్ పడిక్కల్ తెలిపారు.

  • Loading...

More Telugu News