: జగన్ తో మంద కృష్ణమాదిగ భేటీ


వైకాపా అధినేత, ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీ అయ్యారు. నేటి ఉదయం శాసనసభకు వచ్చిన మంద కృష్ణ, అసెంబ్లీ ఆవరణలోనే జగన్ ను కలిశారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జగన్ తో చర్చించానని భేటీ అనంతరం మంద కృష్ణ విలేకరులకు చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని జగన్ ను కోరానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News