: విద్యార్థుల ఆటోను ఢీకొన్న స్కూల్ బస్సు... ఇద్దరు విద్యార్థుల మృతి


నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తీపనూరు వద్ద కొద్దిసేపటి క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించగా, మరో 11 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న ఓ ఆటోను మరో పాఠశాలకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News