: ఆసీస్ టూర్కు క్రికెటర్ల భార్యలు... కోహ్లీకి మాత్రం నిరాశే!
ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్ మ్యాచ్ లలో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు కొంత ఉత్సాహాన్ని ఇచ్చేలా బీసీసీఐ నిబంధనలను సడలించింది. క్రికెటర్ల భార్యలు ఆసీస్ పర్యటనలో ఉన్న భర్తలను కలుసుకునేందుకు బీసీసీఐ అనుమతినిచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ నిబంధనలను స్వల్పంగా సడలించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అయితే, విరాట్ కోహ్లీకి మాత్రం నిరాశే. ఎందుకుంటే, కేవలం జీవిత భాగస్వాములను మాత్రమే అనుమతిస్తామని, ప్రియురాళ్లను అనుమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేయడమే ఇందుకు కారణం.