: "ఇండియా అంటేనే హిందూ"... ఇక భగవత్ వ్యాఖ్యలపై రగడ!


పార్లమెంట్ లో అధికార బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలకు మరో అస్త్రం దొరికింది. ఇండియా అంటే హిందూ దేశమని ఆర్‌ఎస్‌ఎస్ సంఘ్‌ చాలక్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభలు నేడు మరోసారి రాజకీయ రణ రంగానికి వేదిక కానున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్, వామపక్షాలు, జనతా పరివార్ పార్టీలు ఇప్పటికే నిర్ణయించాయి. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతితో పాటు కొందరు బీజేపీ ఎంపీలు చేసిన మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు గత రెండు వారాల నుండి రాజ్యసభను స్తంభింపజేయటం తెలిసిందే. కాగా, మోహన్ భగవత్ ప్రకటనపై బీజేపీ అధినేత అమిత్ షా కూడా ఇరకాటంలో పడిపోయారు. నిన్న చెన్నైలో భగవత్ ప్రకటనపై స్పందించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం.

  • Loading...

More Telugu News