: బొబ్బిలి జనపనార మిల్లు లాకౌట్...కార్మికుల ఆందోళన
విజయనగరం జిల్లా బొబ్బిలిలోని జనపనార మిల్లు మూతపడింది. మిల్లును లాకౌట్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయంపై కార్మికులు భగ్గుమన్నారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కార్మికులు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. లాకౌట్ ను తక్షణమే ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కంపెనీ లాకౌట్ కారణంగా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.