: 'లింగ' నష్టం నేపథ్యంలో రజనీని కలుస్తున్నాం... భద్రత కల్పించండి


ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ చిత్రం 'లింగ' బాక్సీఫీసు వద్ద నిరాశనే మిగిల్చింది. తమిళనాడులో కూడా అనుకున్న స్థాయిలో ఈ చిత్రం వసూళ్లను రాబట్టలేక పోయింది. తిరునల్వేలి, కన్యాకుమారి ఏరియాలకు కోట్లాది రూపాయలు పెట్టి లింగా హక్కులను కొనుగోలు చేయగా... ఇప్పటి వరకు రూ. 1.50 కోట్లు మాత్రమే వసూలు చేసిందట. ఈ నేపథ్యంలో, లింగ నష్టపరిహారం కోసం హీరో రజనీని థియేటర్ల యాజమాన్యం ఈరోజు కలవనుంది. ఈ సందర్భంగా తమకు భద్రత కల్పించాలంటూ వారు చెన్నై పోలీసు కమిషనర్ కు వినతిపత్రం అందించారు. కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కళ్యాణమంటపంలో వీరు రజనీతో భేటీ అవుతున్నారట.

  • Loading...

More Telugu News