: మత మార్పిడులపై ఆరెస్సెస్ తో విభేదాలు లేవు: వెంకయ్యనాయుడు
దేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న మత మార్పిడుల అంశానికి సంబంధించి తమ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)తో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విస్పష్ట ప్రకటన చేశారు. మత మార్పిడులపై ఆందోళన ఉంటే, చట్టానికి కూడా సిద్ధంగానే ఉన్నామని తమ పార్టీ అధినేత అమిత్ షా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన వెంకయ్యనాయుడు అసలు ఆరెస్సెస్ తో విభేదాలు ఎక్కడివని ప్రశ్నించారు. ‘‘మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛ. మతం మారడం కూడా వ్యక్తిగత స్వేచ్ఛ కిందకే వస్తుంది. ఇందులో ప్రభుత్వానికి ఎంతమాత్రం ప్రమేయం లేదు. ఇందులో మా పార్టీకి కూడా ఎలాంటి పాత్ర లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.