: హైదరాబాదులో గూగుల్ సొంత కేంపస్
హైదరాబాద్ నగరంలో గూగుల్ తన సొంత కార్యాలయంను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు ఆ సంస్థ తెలంగాణ సర్కారుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుందని ఐటీ శాఖ కార్యదర్శి హర్ ప్రీత్ సింగ్ చెప్పారు. ప్రస్తుతం హైదరాబాదులో అద్దె భవనంలో గూగుల్ కార్యాలయం నడుస్తోంది. అయితే ఇకపై తన హైదరాబాద్ కార్యాలయంకు సొంత భవనాన్ని ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ తుది నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ఈ భవన నిర్మాణం పూర్తైతే, అమెరికా, బ్రిటన్ ల తర్వాత హైదరాబాద్ కేంపస్ గూగుల్ కు మూడో కేంపస్ గా మారనుందన్నారు. అంతేకాక గూగుల్ కు హైదరాబాద్ కేంపస్ అతిపెద్ద కేంపస్ గా మారనుందని కూడా ఆయన పేర్కొన్నారు.