: మలేసియాలో నల్గొండ వాసి అనుమానాస్పద మృతి


పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లిన మరో తెలుగు వ్యక్తి మృత్యువాత పడ్డాడు. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన సైదయ్య అనే వ్యక్తి మలేసియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని మృతదేహాన్ని భారత్ రప్పించేందుకు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం సైదయ్య మలేసియా వెళ్లినట్టు తెలిసింది. సైదయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News