: లంబసింగిలో 0 డిగ్రీల ఉష్ణోగ్రత... గజగజ వణుకుతున్న మన్నెం
ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందుతున్న విశాఖ మన్నెంలోని లంబసింగి ప్రాంతాన్ని చలి పులి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పతనమయ్యాయి. లంబసింగిలో రాత్రి నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పాడేరులో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ లలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.