: భారత సైనికులు తమ గొప్పదనం చాటారు


భారత సైనికులు తమ గొప్పదనం చాటుకున్నారు. పాకిస్థాన్ కి చెందిన నాలుగేళ్ల బాలుడు పొరపాటున దారి తప్పి సరిహద్దులు దాటి భారత్ లోపలికి వచ్చాడు. ఎలా వచ్చాడో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ బాలుడు బీఎస్ఎఫ్ సిబ్బంది కంటపడ్డాడు. వారు ఆ బాలుణ్ణి చేరదీసి భోజనం, దుస్తులు సమకూర్చారు. ఆడుకోవడానికి ఆట బొమ్మలు కొనిపెట్టారు. అనంతరం బాలుడు దారితప్పిన విషయాన్ని పాక్ సైన్యానికి భారత సైనికాధికారులు తెలియజేశారు. వెంటనే పాక్ సైన్యం బాలుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకుని, వారికి విషయం చెప్పారు. భారత సైన్యాధికారులు ఆ బాలుణ్ణి కుటుంబ సభ్యులకు అప్పగించి తమ పెద్దమనసు చాటుకున్నారు. దీంతో భారత సైన్యానికి ఆ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News