: ఆర్ఎస్ఎస్ తీరుతో దేశంలో అలజడి రేగుతోంది: నితీష్ కుమార్
మతమార్పిళ్లు వద్దంటూ ఒకవైపు ఉపన్యాసాలు ఊదరగొడుతూ, మరోవైపు ఇతర మతాలకు చెందిన వారు హిందూ మతంలోకి రావాలని ఆర్ఎస్ఎస్ చెప్పడాన్ని బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తప్పుపట్టారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, హిందువులను మతం మార్చవద్దని మైనార్టీలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ విజ్ఞప్తి చేయడం సరికాదని అన్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, ఘర్ వాపసీ కార్యక్రమంతో దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పార్టీలన్నీ ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు ఖండిస్తుండగా, బీజేపీ మాత్రం వంత పాడుతోందని ఆయన మండిపడ్డారు.