: బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత సంజయ్ సింగ్ కుమారుడు
ప్రముఖ కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కుమారుడు అనంత్ విక్రమ్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అమేథీ రాజవంశానికి చెందిన అనంత్ విక్రమ్ చేరికతో అమేథీ, సుల్తాన్ పూర్ లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతం కానున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనకు అమేథీ టికెట్ కేటాయిస్తే పోటీ చేస్తానని అనంత్ తెలిపారు. అమేథీ నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.