: జబర్థస్త్ వేణుపై, ఆయనపై దాడి చేసిన వారిపై కేసులు
తెలుగు టీవీ కామెడీ షో 'జబర్దస్త్' వేణుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వేణుపై 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిల్మ్ నగర్ లో వేణుపై దాడి చేసిన గౌడ సంఘం నేతలపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రామిక గౌడ మహిళల జీవన విధానాన్ని అవమానపరచిన 'జబర్దస్త్' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం జిల్లా నాయకులు రెండ్రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'జబర్దస్త్' కార్యక్రమంలో కల్లు వృత్తిని, శ్రామికగౌడ మహిళా జీవన విధానాన్ని అవమానించే విధంగా స్కిట్ ప్రసారం చేశారని, వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.