: అంటరానితనం లేని సమాజాన్ని చూడాలి: రోశయ్య
అంటరానితనం లేని సమాజాన్ని త్వరలో చూడాలని ఉందని తమిళనాడు గవర్నర్ రోశయ్య ఆకాంక్షించారు. తిరుపతిలో ట్రాన్స్ ఫామ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'అంటరానితనం అంతిమయాత్ర' సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, అంటరాని తనం తీవ్రత తగ్గిందని అన్నారు. అయితే దానిని పూర్తిగా నివారించలేకపోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భానుచంద్ర గౌరవ అతిధులుగా హాజరయ్యారు.