: ఒక్క ఇస్లామాబాదులోనే 300 మందిని అదుపులోకి తీసుకున్నారు
పాక్ ప్రభుత్వం జూలు విదిల్చింది. ఫైసలాబాద్ లో నలుగురు తీవ్రవాదులకు ఉరిశిక్షను అమలు చేసింది. తనదాకా వస్తేకానీ తెలియదన్న సామెతను నిజం చేస్తూ పెషావర్ దాడి తరువాత పాక్ భద్రతా బలగాలు తీవ్రవాదులపై పగబట్టేశాయా అనే రీతిలో దేశవ్యాపంగా గాలింపు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఒక్క రోజులోనే ఇస్లామాబాద్ లో 300 మందిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. దీంతో పాకిస్థాన్ భద్రతా బలగాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయి. పాక్ లో తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలని, ఏ చిన్న వేరును మిగిల్చినా, అది ఆ దేశ భద్రతా బలగాలకు పెను సవాలు విసురుతుందని హెచ్చరిస్తున్నాయి.