: ఐఎస్ఐఎస్ కోసం మెహదీ చేసిన ట్వీట్ల పరిశీలన బాధ్యత ఐటీ కంపెనీకి
బెంగళూరు యువకుడు మెహదీ మస్రూర్ చేసిన లక్షా 29 వేల ట్వీట్లను పరిశీలించే బాధ్యతను సిలికాన్ వ్యాలీ లోని ఐటీ సంస్థకు అప్పగించనున్నారు. ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థకు అనుకూలంగా ట్విట్టర్ ఖాతాలు నిర్వహించిన మెహదీ పలు ట్వీట్లను అరబిక్ భాషలో చేశాడని, ఈ ట్విట్టర్ ఖాతాను 1700 హ్యాండిల్స్ అనుసరించాయని, వీటిని పరిశీలించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం బెంగళూరు పోలీసుల వద్ద లేదని వారు స్పష్టం చేశారు. అందుకే వీటిని పరిశీలించే బాధ్యతను థర్డ్ పార్టీకి అప్పగించే ఆలోచనలో ఉన్నామని బెంగళూరు పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు.