: గ్రీన్ బెల్ట్ గా ప్రకటిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: రఘువీరా


రాజధాని నిర్మాణం కోసం భూములివ్వకపోతే ఆ భూములను గ్రీన్ బెల్ట్ గా ప్రకటిస్తామనడం బ్లాక్ మెయిలింగ్ చేయడమే అవుతుందని ఏపీసీసీ చీప్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏటా వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే పంటలు పండే భూములు లాక్కుంటే ఆహారభద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి భూములు లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం సేకరించాలనుకుంటున్న భూముల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మించడం సరికాదని నిపుణులు చెప్పారని ఆయన వివరించారు. అలా నిర్మిస్తే భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఆ విషయాలున్న శివరామకృష్ణన్ కమిటీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News