: సేవ చేయాలనుకుంటేనే రాజకీయాల్లోకి రండి: బీజేపీ నేత రామారావు


ఎవరు పడితే వారు రాజకీయాల్లోకి రావద్దని, ప్రజలకు సేవ చేయగలిగిన వారు మాత్రమే రాజకీయాల్లోకి రావాలని సిక్కిం మాజీ గవర్నర్ రామారావు సూచించారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామంలో బీజేపీ జిల్లా నేత దివంగత వరదరాజులు విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదరాజులు సిద్ధాంతం కోసం పని చేశారని అన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్థికి కృషి చేశారని కొనియాడారు. గ్రామస్థులంతా ఏకతాటిపై నిలిచి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News