: ఢిల్లీలో చిన్నపిల్లల తల్లిదండ్రులకు టెన్షన్ మొదలైంది!


ఢిల్లీలో చిన్నపిల్లల తల్లిదండ్రులకు టెన్షన్ మొదలైంది. ర్యాంకుల వెంట చదువులు పరుగులెత్తుతుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు మాటలు రాక ముందు నుంచే ఏ స్కూల్ లో జాయిన్ చేయాలి? ఎలా చదివించాలి? అంటూ ప్లాన్డ్ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నిన్నటి నుంచి నర్సరీ ప్రవేశాలకు తెరలేచింది. దీంతో తమ పిల్లలను బడిలో వేయాలనుకునే పిల్లల తల్లిదండ్రులకు క్షణం తీరిక లేకుండా పోతోంది. తమ ఇంటికి దగ్గర్లో ఏ ప్రాంతంలోని నర్సరీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి? దరఖాస్తు ఫారాలు తీసుకురావడం, వాటిని నింపి స్కూల్ లో ఇవ్వడం, తరువాత ఇంటర్వ్యూకి హాజరు కావడం, సీటు వచ్చిందో లేదో చూసుకోవడం, ఎక్కడ ముందు సీటొస్తే అక్కడ జాయిన్ చేయడం, ఫీజులు ముందే కట్టేయడం, ఇంటికి దగ్గర్లో సీటొస్తే ముందు జాయిన్ చేసిన స్కూలు నుంచి కట్టేసిన ఫీజులు వాపస్ తెచ్చుకోవడం, వీటన్నింటికీ గంటల తరబడి క్యూలో నిల్చోవడం ఇలా...తల్లిదండ్రులు బిజీబిజీగా వున్నారు.

  • Loading...

More Telugu News