: బైక్ మీద కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించాలి!: అభిషేక్ బచ్చన్
మోటారు సైకిల్ నడిపేవారే కాకుండా వెనుక కూర్చున్నవారు కూడా తప్పకుండా హెల్మెట్ ధరించాలని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచడంలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై అందరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ వ్యాప్తంగా ఉన్న ద్విచక్రవాహన దారులు హెల్మెట్ ధరించి, నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.