: సల్మాన్ 'బిగ్ బాస్' హద్దు దాటితే చూస్తూ ఊరుకోం


ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ కలర్స్ టీవీ చానెల్ లో ప్రసారమవుతున్న'బిగ్ బాస్' రియాలిటీ షో పై రాజ్యసభలో వాడి వేడి చర్చ నడిచింది. బిగ్ బాస్ కార్యక్రమం చాలా అసభ్యకరంగా ఉందని కొంత మంది ఎంపీలు కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకొచ్చారు. కెమేరాలు పెట్టి యువతుల స్నాన దృశ్యాలను చూపుతున్న ఇలాంటి టీవీ కార్యక్రమాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి సభకు సమాధానమిస్తూ దేశంలో భావప్రకటన స్వేచ్ఛ ఉందని, పరిధి దాటినట్టు భావిస్తే వారిని నియంత్రిస్తామని ఆయన స్పష్టం చేశారు. కేవలం బిగ్ బాస్ మాత్రమే కాదని, వివిధ టెలివిజన్ టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్న రియాలిటీ షోల పోకడలను సమాచార శాఖ గమనిస్తోందని అన్నారు.

  • Loading...

More Telugu News