: బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్
తమిళనాడులో బీజేపీ మరింత దూకుడు పెంచింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం చెన్నై వచ్చిన అమిత్ షా సమక్షంలో కేంద్ర మాజీ మంత్రి నెపోలియన్ కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కోలీవుడ్ లో ప్రముఖ నటుడిగా పేరుగాంచిన నెపోలియన్ 2009 ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత యూపీఏ-2 సర్కారులో సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తాజాగా ఆయన అమిత్ షా సమక్షంలో డీఎంకేను వీడి బీజేపీలో చేరారు. నిన్నటికి నిన్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ను చేర్చుకున్న బీజేపీ, మరునాడే కేంద్ర మాజీ మంత్రిని తన జట్టులో చేర్చుకుంది. ఈ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 2016లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సీఎం అభ్యర్థిని ప్రకటించాకే బరిలోకి దిగుతామని ఆయన ప్రకటించారు.