: గుంటూరు టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...ఎమ్మార్పీఎస్ కార్యకర్తల అరెస్ట్


గుంటూరులోని టీడీపీ కార్యాలయం వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత నెలకొంది. ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు టీడీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు కార్యాలయంలోని ఏపీ మంత్రులు రావెల కిశోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులను కలిసేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News