: కొమురవెల్లి మల్లన్నకు కేసీఆర్ పట్టు వస్త్రాల సమర్పణ
వరంగల్ జిల్లా చేర్యాల మండలంలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కొద్దిసేపటి క్రితం కొమురవెల్లి చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరఫున మల్లన్న కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం ఆయన కల్యాణోత్సవాన్ని తిలకించారు. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్న మల్లన్న ఆలయంలో సరైన వసతులు లేవు. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లో ఆయన అక్కడ చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.