: హాస్యనటుడు వేణుపై దాడి... జబర్దస్త్ స్కిట్ నేపథ్యమే కారణమా?
టాలీవుడ్ హాస్యనటుడు, ఈటీవీ కామెడీ ప్రోగ్రాం జబర్దస్త్ తో మరింత ప్రాచుర్యం పొందిన కమెడియన్ వేణుపై శనివారం రాత్రి దాడి జరిగింది. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో జరిగిన ఈ దాడిలో గాయపడ్డ వేణును అతడి స్నేహితులు అపోలో ఆస్పత్రిలో చేర్చారు. జబర్దస్త్ లో భాగంగా ఈ నెల 18న రాత్రి 9.30 గంటలకు ప్రసారమైన ఓ స్కిట్ నేపథ్యంలోనే వేణుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ కార్యక్రమంలో ప్రసారమైన సదరు స్కిట్ లో వేణు, గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళల జీవన విధానాన్ని కించపరిచేలా వ్యవహరించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయనపై దాడి జరిగిందన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు సదరు కార్యక్రమాన్ని ప్రసారం చేసిన ఈటీవీపై కూడా చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం గౌడ సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది.