: రాష్ట్ర విభజనలో జగన్ కాంగ్రెస్ తో కుమ్మక్కు: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు
రాష్ట్ర విభజనలో వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఆ కారణంగానే జగన్ గడచిన ఎన్నికల్లో దెబ్బతిన్నారని ఆయన చెప్పారు. సహచర ఎంపీలు అవంతి శ్రీనివాస్, రవీంద్రబాబులతో కలిసి విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రామ్మోహన్ నాయుడు ఈ మేరకు జగన్ పై విమర్శలు సంధించారు. ఓ పక్క రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నానని చెప్పిన జగన్, కాంగ్రెస్ తో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రజలు వైకాపాను ఓడించారని ఆయన చెప్పారు.