: చెరువులో ఈతకెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
హైదరాబాదులోని మాసాయిపేటలో నేటి ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఈతకోసమంటూ వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. మాసాయిపేట సమీపంలోని మైసమ్మ చెరువులో ఈతకని వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మరణించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.