: హైదరాబాద్ బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం...క్షేమంగా ఇంటికి చేరిన రోహిత్
రెండు రోజుల క్రితం అపహరణకు గురైన కుషాయిగూడ బాలుడు రోహిత్ క్షేమంగా ఇల్లు చేరాడు. బాలుడి కిడ్నాప్ పై పోలీసులు నిఘా పెంచిన నేపథ్యంలో కిడ్నాపర్లు బాలుడిని కాప్రా చెరువు వద్ద వదిలేసి పరారయ్యారు. దాంతో బాలుడు రోహిత్ క్షేమంగా ఇల్లు చేరుకున్నాడు. దీంతో రెండు రోజులుగా తీవ్ర ఆందోళనలో మునిగిపోయిన బాలుడి తల్లిదండ్రులకు ఎట్టకేలకు ఊరట లభించింది. బాలుడి తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదునందుకున్న నేపథ్యంలో కిడ్నాపర్ల మొబైల్ ఫోన్లపై నిఘా పెంచామని, విషయాన్ని పసిగట్టిన దుండగులు బాలుడిని వదిలేసి పరారయ్యారని పోలీసులు చెబుతున్నారు. బాలుడు సురక్షితంగా ఇంటికి చేరినా, నిందితులను మాత్రం వదిలిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.