: నైజీరియాలో అపహరణకు గురైన శ్రీనివాసరావు విడుదల
నైజీరియాలో అపహరణకు గురైన గుంటూరు జిల్లా వాసి టంగుటూరి శ్రీనివాసరావు విడుదలయ్యారు. గత నెల 26న నైజీరియాలో శ్రీనివాసరావు అపహరణకు గురయ్యారని అతని స్నేహితుడు ఇక్కడున్న శ్రీనివాసరావు భార్య, తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో శ్రీనివాసరావును ఎలాగైనా విడిపించాలని రాష్ట్ర, భారత ప్రభుత్వాలకు వారు విజ్ఞప్తి చేశారు. ఎట్టకేలకు తాను బందీల నుంచి విడుదలైనట్టు చింతలపూడిలోని తన తండ్రి శేషయ్యకు శ్రీనివాసరావు సమాచారం అందించారు.