: ఏపీలో ప్రపంచ స్థాయి విద్యాప్రమాణాలు అమలు చేస్తాం: బాబు
ఆంధ్రప్రదేశ్ లో అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నూతన సాంకేతిక విధానానికి బాబు శ్రీకారం చుట్టారు. గూగుల్ హాంగవుట్ ద్వారా రాష్ట్ర ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తామని అన్నారు.