: రాజీనామా చేసేది లేదంటున్న దేవయాని ఖోబ్రగడే


తనను బాధ్యతల నుంచి కేంద్ర విదేశాంగ శాఖ తొలగించినప్పటికీ తాను మాత్రం రాజీనామా చేసేది లేదని ఐఎఫ్ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడే స్పష్టం చేశారు. ఆంగ్ల ఛానల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ ఆమె, "పదవికి రాజీనామా చేయను. నేను ఎలాంటి సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించలేదు" అన్నారు. వ్యక్తిగత విషయాలను ఓ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించిన కారణంగా విదేశాంగ శాఖ దేవయానిని అభివృద్ధి భాగస్వామ్య డివిజన్ డైరెక్టర్ పదవి విధుల నుంచి తొలగించినట్టు ఈ రోజు వార్తలు వచ్చాయి.

  • Loading...

More Telugu News